నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: భైంసా మండలం వానల్ పాడ్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని భైంసా ఏడీఈ ఆదిత్య తెలిపారు. సబ్ స్టేషన్‌లో పీటీఆర్ మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు గమనించి అంతరాయనికి సహకరించాలని కోరారు.