పరిమితికి మించి ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం

KDP: సిద్దవటం మండలంలోని మాచుపల్లి, డేగనవాండ్లపల్లి, లింగంపల్లి, కడపాయపల్లి, తురకపల్లి గ్రామాల్లో ప్రజలు బండి కనుమ రహదారిలో నిత్యం కడపకు వెళ్తుంటారు. ఆటో వాహనదారులు మితిమీరి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.