ఏసీ, ఫ్రిడ్జ్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ

ఏసీ, ఫ్రిడ్జ్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ

NLG: నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయంఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగులకు హౌస్ వైరింగ్, AC, ఫ్రిడ్జ్ రిపేరింగ్ & సర్వీసింగ్‌లో ఉచితశిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 19-45 సం. ల మధ్య ఉండి పదో తరగతి పాసైన ఉమ్మడి జిల్లా వారు అర్హులను పేర్కొన్నారు. Jun 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.