నేడు డయల్ యువర్ APSPDCL CMD కార్యక్రమం
NLR: విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించేందుకు డయల్ యువర్ APSPDCL CMD కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు (APSPDCL) ఛైర్మన్ శివశంకర్ లోతేటి ప్రకటించారు. విద్యుత్ వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలు, సూచనలు, ఇబ్బందులను నేరుగా CMDకు తెలియజేయవచ్చని తెలిపారు.