బిర్సా ముండా చిత్రపటానికి కలెక్టర్ నివాళి
SS: జన జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బిర్సా ముండా జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సూర్యనారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.