ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు డిపాజిట్
పుదుచ్చేరి సీఎం ఎన్ రంగసామి కీలక హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే ఆమె పేరిట రూ.లక్ష FD డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రూ.50 వేలు డిపాజిట్ చేస్తోందని, మళ్లీ అవకాశం ఇస్తే రూ.లక్షకు పెంచుతామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా బాలికల భవిష్యత్‌కు, ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.