ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీ మోసం
JN: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ. 9.5లక్షలు వసూలు చేసిన ఘటన అమీర్‌పేట్‌లో వెలుగుచూసింది. ఎస్.ఎస్.సెక్యూరిటీ ఫోర్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ యజమాని డి.వి. మసుబ్బారావుపై ఎస్సార్ నగర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన పలువురు బాధితుల నుంచి క్లాస్-4 ఉద్యోగాల పేరిట డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు.