రెవెన్యూ భవనానికి శంకుస్థాపన

W.G: భీమవరంలోని మావుళ్లమ్మ గుడి వద్ద గ్రామ రెవెన్యూ అధికారుల కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన వందేళ్ల నాటి గ్రామసావిడి స్థానంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.