వలసపాకలలో రేషన్ బియ్యం పంపిణీపై ఫిర్యాదులు

వలసపాకలలో రేషన్ బియ్యం పంపిణీపై ఫిర్యాదులు

KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి సరైన పరిమాణంలో బియ్యం అందడం లేదని, మరికొందరికి ఆలస్యంగా పంపిణీ జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాణ్యత కూడా సరిగా లేదని మహిళలు చెబుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.