జర్నలిస్టుల దీక్షలకు టీఎస్‌జేయూ మద్దతు
BHPL: జిల్లాలోని 37 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్షలు శనివారం 8వ రోజుకు చేరుకున్నాయి. 8వ రోజు దీక్షలకు టీఎస్‌జేయూ నాయకులు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించే వరకు టీఎస్‌జేయూ అండగా ఉంటుందన్నారు.