టీడీపీ కార్యకర్తకు జనసేన ఎమ్మెల్యే సాయం

W.G: తాడేపల్లిగూడెం మండలం తాళ్లపాలెంలో టీడీపీ కార్యకర్త గజ్జల సుబ్బారావు అనారోగ్యంతో బాధపడుతున్నందున వారి కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఆర్థిక సహాయంగా రూ.10,000 అందజేశారు. అలాగే బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.