నాటు సారా శిబిరంపై దాడి.. వ్యక్తి అరెస్ట్

నాటు సారా శిబిరంపై దాడి.. వ్యక్తి అరెస్ట్

కృష్ణా: ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజయవాడ రవి కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై సుధాకర్ మచిలీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా అగ్రహారం గ్రామంలో చేపట్టిన తనిఖీల సమయంలో రాజుకు చెందిన సుమారు 7.75 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.