జిల్లాలో 220 మంది వర్కర్ల తొలగింపు
ASF: జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 220 మంది కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ IDTA PO ఖుష్బూ గుప్తా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జీతాలు తీసుకుంటూ విధులకు హాజరు కాకుండా సమ్మె చేపట్టినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి స్థానంలో వేరే వారిని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు.