పోలీస్ పాత్రలో 144 సార్లు.. గిన్నిస్ రికార్డ్

పోలీస్ పాత్రలో 144 సార్లు.. గిన్నిస్ రికార్డ్

ఓ బాలీవుడ్ నటుడు అత్యధిక సార్లు ఒకే పాత్రలో నటించి గిన్నిస్ రికార్డు సాధించాడు. హిందీ నటుడు జగదీష్ రాజ్ ఖురానా తాను నటించిన సినిమాల్లో 144 సార్లు పోలీస్ పాత్రలో కనిపించాడు. దీంతో ఆయన గిన్నిస్, లిమ్కా బుక్ రికార్డ్స్‌లో పేరు సంపాదించుకున్నాడు. అతడిని బాలీవుడ్‌లో ‘ఇన్‌స్పెక్టర్ సాబ్’ అని పిలిచేవారు. కాగా, 2013లో శ్వాసకోశ సమస్యలతో కన్నుమూశాడు.