విశాఖ డిప్యూటీ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం

విశాఖ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి నేతలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం శనివారం నెగ్గింది. విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జీవీఎంసీ సమావేశం జరిగింది. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టగా 74 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు.