VIDEO: కన్నుల పండుగగా సుదర్శన హోమం

VIDEO: కన్నుల పండుగగా సుదర్శన హోమం

NLG: నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై వెలిసిన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం సుదర్శన హోమం కన్నుల పండువగా జరిగింది. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన భక్త దంపతులు హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు.