వర్షపునీటితో రామాలయం పరిసర ప్రాంతాలు జలమయం

BDK: భద్రాచలంలో బుధవారం తెల్లవారుజామున నుండి కురుస్తున్న భారీ వర్షానికి రామాలయం విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం ప్రాంతాలకు వర్షపునీరు చేరి ముంపుకు గురైయ్యాయి. పట్టణం నుండి వచ్చే వరద నీటిని గోదావరిలోకి ఎత్తి పోయడానికి మోటార్లు ఏర్పాటు చేసినా, వాటిని గోదావరికి వరదలు వచ్చినప్పుడే వినియోగిస్తుండటంతో రామాలయం ప్రాంతంలో ఈ సమస్య తలెత్తుతుంది.