'దుర్గ మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు'

'దుర్గ మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు'

TPT: టీడీపీ నాయకురాలు దుర్గ మృతిపై తిరుపతి రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేసినట్లు ఆమె తండ్రి, బీసీ నేత షణ్ముగం తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. తన కూతురి మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గురువారం విచారణకు హాజరుకావాలని కమిటీ నుంచి పిలుపు అందిందన్నారు.