డుంబ్రిగుడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ASR: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శనివారం డుంబ్రిగుడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎం.స్వామి, టీ.సుబ్బారావు, భాస్కరరావు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. క్యూఆర్ కోడ్ గల ఈ కార్డుల ద్వారా కుటుంబ వివరాలు, బియ్యం పంపిణీ వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.