'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'
నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశించారు. బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.