శంకర్ విలాస్ సెంటర్‌లో రైతు, కార్మిక సంఘాల నిరసన

శంకర్ విలాస్ సెంటర్‌లో రైతు, కార్మిక సంఘాల నిరసన

గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో రైతు, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటీవల వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.