ఒక్కరోజే 20 మందిని కరిచిన వీధి కుక్కలు!
హైదరాబాద్‌లో మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. జీడిమెట్ల, బాలానగర్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో ప్రజలపై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. ఇవాళ GHMC మహిళా కార్మికులు విధులు నిర్వర్తిస్తుండగా కుక్కల గుంపు దాడి చేసింది. అడ్డుకున్న పలువురిని గాయపరిచాయి. ఇవాళ ఒక్కరోజే ఆ ప్రాంతంలో 20 మందిపైగా కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.