కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీగా భూపతి
సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీగా తంగళ్ళపల్లికి చెందిన లింగాల భూపతి నియామకమయ్యారు. ఈ సందర్భంగా భూపతి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పార్టీకి సేవ చేస్తానని వివరించారు.