కూతురి పెళ్లి రోజే ఆగిన తల్లి గుండె

BDK: కుమార్తె వివాహం జరిగిన రోజే తల్లి గుండె ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కామేపల్లి(M) అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహన్‌లాల్, కల్యాణి (38) దంపతుల కుమార్తెకు కొత్తతండాకు చెందిన వ్యక్తికి నిన్న విహహం జరిగింది. ఈ క్రమంలో అప్పగింతల సమయంలో తల్లి కల్యాణి బావోద్వేగానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.