కాంగ్రెస్‌లో చేరిన చందుపట్ల బీఆర్ఎస్ నాయకులు
NLG: నకిరేకల్ మండలం చందుపట్ల కు చెందిన బీఆర్ఎస్ నేతలు నర్సింగ్ సోమేశ్వర్, కలమ్మ, శైలజ, శాంతమ్మ, సుశీల, నాగమ్మ, స్రవంతి, పార్వతమ్మ, తండు నాగరాజు, శిగ రాంముర్తి, కోటేశ్, సంపత్ లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్లోనే తన నివాసం వద్ద కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.