ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో 10% రాయితీ..!

MDK: ఆర్టీసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీల్లో 10 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య తెలిపారు. నెలవారీ సీజన్ టికెట్లపై 20 రోజుల ఛార్జీతో 30 రోజులు ప్రయాణం చేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయం ఈ నెల 1వ నుంచి అమలులోకి వచ్చిందన్నారు. రూ. 210లు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు.