మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ

GNTR: విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తాడికొండ సీఐ వాసు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇకపై కాలేజీలు, పాఠశాల, పరిసర ప్రాంతాల్లో సిగరెట్లు, గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు.