నెల్లూరులో 'విహాన్' ఫుడ్స్ ఘరానా మోసం

నెల్లూరులో 'విహాన్' ఫుడ్స్ ఘరానా మోసం

NLR: సంప్రదాయ వంటల ఫ్రాంచైజీల పేరుతో 'విహాన్ గ్రామీణ హోం ఫుడ్స్' సంస్థ భారీ మోసానికి పాల్పడింది. నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల వారి నుంచి డిపాజిట్లు సేకరించి, సరుకు ఇవ్వకుండా బోర్డు తిప్పేశారు. న్యాయం చేయాలని 20 మంది బాధితులు దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ కళ్యాణ రాజుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.