విద్యార్థుల యూనిఫాంపై ఎంఈవో అసహనం
ప్రకాశం: కంభం మండలంలోని రంగరాజు ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు కనిపించారు. పాఠశాలను ఎంఈవో అబ్దుల్ సత్తార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే తరగతి గదిలో విద్యార్థులు వేర్వేరు యూనిఫాంలు ధరించి కనిపించారు. ఎంఈవో ఆశ్చర్యానికి లోనయ్యారు. యూనిఫాం అంటే ఏకరూపమే తప్ప ఇలా రెండు రకాలు కాదని యాజమాన్యానికి సూచించారు.