కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కంటైనర్

కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కంటైనర్

SKLM: పలాస మండలం నెమలి నారాయణపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఒరిస్సా వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీ రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది, పోలీసులు లారీ డ్రైవర్‌ని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.