హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
NTR: విజయవాడకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా విష పదార్థం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఆయనను గమనించిన సిబ్బంది లబ్బీపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. కాగా, విష పదార్థం తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.