'ఆకివీడులో భవ్య రామాలయం నిర్మిస్తాం'
W.G: ఆకివీడు పెదపేటలో శిథిలావస్థకు చేరిన రామాలయం స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించి తీరుతామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శనివారం స్పష్టం చేశారు. పెదఅమీరంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది శ్రీరామనవమి లోపు అందమైన రాతి కట్టడంతో ఆలయాన్ని పూర్తి చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలను భక్తులు పట్టించుకోవద్దని ఆయన కోరారు.