VIDEO: సంపరలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ సప్త మహోత్సవాలు

VIDEO: సంపరలో ఘనంగా ప్రారంభమైన  శ్రీరామ సప్త మహోత్సవాలు

KKD: పెదపూడి మండలం సంపర గ్రామంలో 60వ వార్షిక శ్రీరామ సప్త మహోత్సవాలకు గురువారం అంకురార్పణ చేశారు. వేద పండితులు కండవల్లి హనుమంత ఆచార్యుల ఆధ్వర్యంలో గ్రామస్థులు, భక్తులు శాస్త్రోక్తంగా పందిరి రాట వేశారు. లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సత్యసాయి భక్త సమాజం నేతలు తెలిపారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.