గన్నవరంలో విఖసన మహర్షి జయంతి

గన్నవరంలో విఖసన మహర్షి జయంతి

కృష్ణా: గన్నవరం వైఖానస యూత్ ఆధ్వర్యంలో విఖసన మహర్షి జయంతి మహోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీబొమ్మ కూడలి నుంచి స్వామి వారిని ప్రత్యేక రథంపై శోభాయాత్ర నిర్వహించారు. దావాజీగూడెం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకులు రామాచార్యులు అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి.