పలు దేవాలయాల్లో మాజీ మంత్రి ప్రత్యేక పూజలు

VZM: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఘన విజయం సాధించాలని కోరుతూ గజపతినగరంలోని పలు దేవాలయాల్లో మాజీ మంత్రి జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ బుధవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఒకవైపు రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడుతూనే మరోవైపు చలనచిత్ర రంగంలో ఓ సందేశాత్మక నటుడిగా నిలిచారని ఆమె చెప్పారు.