VIDEO: భగ్గుమంటున్న ఎండలు
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో ఎండలు భగ్గుమంటున్నాయి. శనివారం ఉష్ణోగ్రతలు 42°C వరకు చేరడంతో మధ్యాహ్నం తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండలు, వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతుండగా, అత్యవసర పనులకే ప్రజలు బయటకు వస్తున్నారు. ఇదే సమయంలో కరెంటు కోతలు కూడా ప్రజలకు మరింత తలనొప్పిగా మారాయి.