ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి

KMM: ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి అటవీ ప్రాంతంలో మేకల కాపరి సోమార్ (40)పై ఎలుగుబంటి దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం జరగగా, కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.