VIDEO: నరసాపురంలో మరో YSR విగ్రహం ధ్వంసం
W.G: నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలో YSR విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. సోమవారం సీతారాంపురం సెంటర్లోని విగ్రహం చేతిని విరగ్గొట్టిన దుండగులు, మంగళవారం అర్ధరాత్రి పిల్లిపేటలోని మరో YSR విగ్రహం చేతి వేళ్లను విరగ్గొట్టారు. 24గంటల వ్యవధిలోనే 2 విగ్రహాలను లక్ష్యంగా చేసుకోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.