VIDEO: RTC సమ్మె ప్రభావం రవాణా అస్తవ్యస్తం
NGKL: జిల్లాలో RTC కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. డిమాండ్ల పరిష్కారం కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు. 90 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.