రోడ్లపై మండపాలు నిషేధం: డీఎస్పీ

రోడ్లపై మండపాలు నిషేధం: డీఎస్పీ

కృష్ణా: రోడ్లపై గణేష్ మండపాలు ఏర్పాటు చేయకూడదని DSP శ్రీనివాసరావు తెలిపారు. గురువారం బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మట్టి గణపతిని ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. మండపాలకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు.