కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన
VZM: గుర్ల మండలానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ.. తోటపల్లి రిజర్వాయర్ ఏర్పాటుతో వ్యవసాయం, పశు అభివృద్ధితో రైతులు జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అలాగే ఏడాదికి రెండు పంటలు పండే భూములను ప్రైవేట్ ఉక్కు పరిశ్రమకు ఇవ్వబోమంటూ రైతులు తేల్చి చెప్పారు.