17కు చేరిన మృతుల సంఖ్య

17కు చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర నాగ్‌పూర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాణాసంచా పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. కటోల్‌లోని బాణాసంచా తయారీ పరిశ్రమలో మంటలు అంటుకుని భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.