సరళ సాగర్ ఆటోమెటిక్ సైఫన్‌లు ఓపెన్

సరళ సాగర్ ఆటోమెటిక్ సైఫన్‌లు ఓపెన్

MBNR: దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం పరిధిలోని సరళ సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫన్‌లు బుధవారం తెరుచుకున్నాయి. ప్రాజెక్టులోని రెండు వుడ్, ఒకటి ప్రైమర్ సైఫాన్లు తెరుచుకోవడంతో ఊక చెట్టు వాగులోకి భారీగా నీరు విడుదలవుతోంది. వాగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.