ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

W.G: మొగల్తూరులోని పూరి గుడిసెలో కొనసాగుతున్న శ్రీ నడివీధి ముత్యాలమ్మ ఆలయంలో మంటలు చెలరేగి దగ్ధమైన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. నాయకర్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో వాస్తవ కారణాలను తక్షణమే వెలికితీయాలని పోలీసు శాఖను ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.