చిరుత పులుల సంచారంపై అధికారుల హెచ్చరిక

మహబూబ్ నగర్: జిల్లాలో చిరుత పులులు విస్తృతంగా సంచరిస్తుండడం పట్ల జిల్లా ఫారెస్ట్ అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. చిరుత పులిని బంధించేందుకు టీడీ గుట్ట ప్రాంతంలో 3 బోన్లు, 5 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పురపాలక పరిధిలో దాదాపు 40 ఫోకస్ లైట్లను గుట్టకు ఆనుకుని ఉన్న ఇళ్లకు అమర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.