సాలేగూడలో గృహజ్యోతి పథకాలపై అవగాహన

సాలేగూడలో గృహజ్యోతి పథకాలపై అవగాహన

కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం, సాలేగూడలోని 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సభ సర్పంచ్ కుమరం వందన అధ్యక్షతన జరిగింది. ఇందులో ప్రత్యేక అధికారి పాల్గొని, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.