హెల్మెట్ వాడకంపై ప్రతిజ్ఞ: సీఐ

CTR: హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞను వాహన చోదకులతో దుర్గా సర్కిల్ వద్ద టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య మంగళవారం రాత్రి చేయించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలన్నారు. తద్వారా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితి లేక, చిన్నపాటి గాయాలతో బయటపడతారన్నారు.