మోటర్ తీగలను ఎత్తుకెళ్లిన దుండగులు
ATP: గుత్తి శివారులో పురుషోత్తం అనే రైతుకు చెందిన తోటలో పట్టపగలే ఓ గుర్తుతెలియని వ్యక్తి మోటర్ వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లాడు. గత వారం రోజులుగా పంట పొలాలలోని మోటార్ తీగలను దొంగిలిస్తున్నట్లు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత రైతు పురుషోత్తం మాట్లాడుతూ... సుమారు పది మీటర్ల వైరు కత్తిరించి తీసుకెళ్లారన్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.