టీడీపీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

టీడీపీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ADB: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు తెలుగు యువత జిల్లాధ్యక్షుడు గాలిపెళ్లి నాగన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల విరోచిత పోరాట పటిమ వల్లే స్వాతంత్య్ర సిద్ధించిందన్నారు. వారి ఆశయ సాధనకు పని చేయాలని పిలుపునిచ్చారు.