ధాన్యం కుప్పలు ఢీకొని ఇద్దరికీ తీవ్రగాయాలు
SRCL: చందుర్తి మండల కేంద్రం నుంచి ఉమ్మడి మేడిపల్లి మండలం మోత్కరావుపేట వెళ్లే రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డుపై రైతులు ధాన్యం రాశులు ఆరబోయడంతో ద్విచక్ర వాహనంపై వెళ్లిన చందుర్తి మండలం కేంద్రానికి చెందిన లింగంపల్లి వెంకటి, బొల్లు దేవరాజం అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, రోడ్డుపై దాన్యం కుప్పలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు.